జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్ మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణితో కలిసి లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్‌కార్డులు పంపిణీ చేశారు. అనంతరం విప్ మాట్లాడుతూ..జననాల నమోదు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం దరఖాస్తు ప్రక్రి య నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డులో 11 ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయని, క్యూర్ కోడ్ కారణంగా నకిలీ కార్డులు తయారు చేయడం కష్టమన్నా రు. 15 రోజుల్లో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో మీ–సేవా కేంద్రాన్ని అయిలయ్య ప్రారంభించారు.


