కవి భాస్కర్‌ మరణం సాహిత్యరంగానికి లోటు | - | Sakshi
Sakshi News home page

కవి భాస్కర్‌ మరణం సాహిత్యరంగానికి లోటు

Aug 14 2026 7:26 AM | Updated on Aug 14 2026 7:26 AM

జనగామ రూరల్‌: సామాజిక కవి, ఉపాధ్యాయుడు పొట్టబత్తిని భాస్కర్‌ ఆకస్మిక మరణం కళా,సాహిత్య రంగాలకు, పోరుగడ్డకు తీరనిలోటని ప్రముఖ చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కెమిస్ట్రీభవన్‌న్‌లో కవులు కళాకారుల ఐక్యవేదిక పొట్టబత్తిని భాస్కర్‌ యాదిలో ఏర్పాటు చేసిన ‘కలాలు గళాల నీరాజనం’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి పెట్లోజు సోమేశ్వరాచారి, జరసం అధ్యక్షుడు నక్క సురేష్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాస్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సమ్మయ్య మాట్లాడుతూ.. భాస్కర్‌ సామాజిక స్పృహ కలిగి చక్కని వచన కవిత్వం సృజించారని అన్నారు. కార్యక్రమంలో ప్రజా వైద్యుడు, మాజీ కల్నల్‌ మాచర్ల భిక్షపతి, నెల్లుట్ల ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు నెల్లుట్ల రవీందర్‌ రావు, కవులు కళాకారులు జి.కృష్ణ, లగిశెట్టి ప్రభాకర్‌, వేముల సదానందం, కొలిపాక బాలయ్య, తాళ్లపల్లి లక్ష్మణ్‌ గౌడ్‌, గుగ్గిల నర్సయ్య, గట్టగల్ల సంజీవ, కడారి శ్రీను, చిలు మోజు సాయికిరణ్‌, రంగరాజు ప్రసాద్‌, సదానందం, గడ్డం మనోజ్‌ కుమార్‌ గౌడ్‌, మాన్యపు భుజేందర్‌, అంకాల సోమయ్య, మసురం రాజేంద్రప్రసా ద్‌, బాల్నె నీరజ, కనకయ్య, ఎల్లయ్య, నర్సయ్య, టి.రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement