మహిళకు మనోధైర్యం | - | Sakshi
Sakshi News home page

మహిళకు మనోధైర్యం

Aug 13 2026 1:09 AM | Updated on Aug 13 2026 1:09 AM

2019 నుంచి ఇప్పటివరకు కేసుల వివరాలు

సఖి ద్వారా సత్వర పరిష్కారం

ఆపదలో అండగా ‘సఖి’

చెట్టునీడలో ఉన్న మహిళను చేరదీసి

జనగామ రూరల్‌: ఆపద వేళల్లో మహిళలకు సఖి కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి. బాధిత మహిళలు పూర్తిగా కోలుకునే వరకు సఖి సిబ్బంది మనోధైర్యం నింపుతూ బాసటగా ఉంటున్నారు. బాధితులకు చేయూతని వ్వడంతో పాటు వివిధ న్యాయపరమైన గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గృహహింస, పోలీసు, వైద్య, న్యాయ సహాయం అందిస్తున్నారు.

ఉచితంగా సేవలు..

మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వివిధ రకా ల వేధింపులు, హింసల నుంచి వారికి రక్షణ కల్పి స్తూ బాధితుల సమస్యలకు అవసరమైన సహాయాన్ని ఒకే చోట అందించడం సఖి కేంద్రం ముఖ్య ఉద్దేశం. బాధిత మహిళలకు వైద్యం, న్యాయ, కౌన్సెలింగ్‌, పోలీసు సహాయం, తాత్కాలిక వసతి, అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూ వంటి సేవలు ఉచితంగా అందిస్తారు. సఖి కేంద్రం జిల్లా నిర్వాహకురాలు రేణుక మాట్లాడుతూ ఇప్పటివరకు 1,431 సదస్సుల ద్వారా 1,20,332 మందికి అవగాహన కల్పించినట్లు, 2,333 సెషన్స్‌ నిర్వహించినట్లు తెలిపారు.

మూగమహిళ చేరదీత

లింగాల ఘణపురం నుంచి తప్పిపోయిన ఓ మూగ మహిళ ను సఖి కేంద్రానికి తీసుకొచ్చారు. బాధితురాలికి వసతి సౌకర్యం కల్పించి చిరునామా తెలుసుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేశా రు. బాధితురాలితో స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌తో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. ఆమె నెల క్రితం ఒక పాపకు జన్మనిచ్చింది. ఆ పాప చనిపోవడంతో పాటు ఆమెకు అనారోగ్య సమస్యలు వచ్చా యి. ఆస్పత్రిలో వివరాలు ఉండడంతో.. ఆ వివరా లు సేకరించిన భర్త మహిళను ఇంటికి తీసుకెళ్లారు.

జార్ఖండ్‌ మహిళను కుటుంబానికి అప్పగించి..

పది రోజుల కిందట జార్ఖండ్‌కు చెందిన మహిళ జనగామ బస్టాండ్‌ పరిసరాల్లో ఉంటోందని తెలియడంతో సఖి కేంద్రానికి తీసుకొచ్చారు. బాధిత మహిళతో మాట్లాడితే తాను జార్ఖండ్‌లోని సోనావా ప్రాంతానికి చెందినట్టు తెలిపింది. అక్కడి సఖి కేంద్రంతో మాట్లాడి రెడ్‌క్రాస్‌ సొసైటీ సహాయంతో సోషల్‌ మీడియాలో, ఫేస్‌బుక్‌ ద్వారా ప్రచారం చేయించారు. విషయం తెలుసుకున్న మహిళ కుటుంబ సభ్యులు జనగామ సఖి కేంద్రానికి ఫోన్‌ చేసి..ఇక్కడికి వచ్చి మహిళను తీసుకెళ్లారు.

ఆపదలో ఉన్న మహిళలకు, యువతులకు సఖి సిబ్బంది అండగా ఉంటూ వారికి మానసిక స్థైర్యం అందిస్తున్నారు. సఖి కేంద్రానికి ఫిర్యాదు చేస్తే చాలు కావాల్సిన సహాయం చేస్తున్నారు. కేసు వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు కేసును బట్టి లీగల్‌ సహాయకులు, లీగల్‌ కౌన్సెలర్లు, పోలీసు, న్యాయ, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. దీంతో సఖి కేంద్రానికి ఫిర్యాదుల సంఖ్య పెరుగుతున్నాయి. 2019 నుంచి ఇప్పటివరకు 1,470 కేసులు రాగా 90 శాతం పూర్తి చేశారు.

పేద మహిళలు, వృద్ధులు, యువతుల సమస్యల పరిష్కారానికి సఖి కేంద్రం ఆధ్వర్యంలో సత్వరం కృషి చేస్తోంది. అత్యవసర సమయంలో 181 డయల్‌ చేస్తే నిర్వాహకులు ఆదుకుంటారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అవసరమయ్యే న్యాయ, ఇతర సహాయాలు అందజేస్తున్నారు. కేసుల పరిష్కారంలో సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

–బెన్‌షాలోమ్‌, అదనపు కలెక్టర్‌

వేధింపులు, గృహహింస తదితర

సమస్యలకు చేయూత

2019 నుంచి ఇప్పటివరకు

1,470కేసులు

90 శాతానికిపైగా కేసుల్లో పరిష్కారం

బాధితులకు ఉచిత న్యాయ, పోలీసు, ఇతర సహాయం

స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం ఇప్పగూడెం గ్రామంలో 75 సంవత్సరాల వృద్ధురాలు కొంతకాలంగా గ్రామంలోని చెట్ల కింద నివాసం ఉంటోంది. దీంతో సమాచారం అందుకున్న కలెక్టర్‌ స్పందించి వృద్ధురాలికి కావాల్సిన సహాయం అందించాలని, షెల్టర్‌ అందించాలని సఖి సిబ్బందిని ఆదేశించారు. వెంటనే సంఘటనా స్థలానికి సఖి సిబ్బంది చేరుకోని సీఐ, సర్పంచ్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుశీలమ్మ అనాథాశ్రమంలో చేర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement