దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Aug 13 2026 1:09 AM | Updated on Aug 13 2026 1:09 AM

ఖోఖో జాతీయ శిక్షణకు చెన్నూరు యువకుడు

జనగామ రూరల్‌: ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌ కె.శ్రీనివాస్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సంబంధిత పీజీ కోర్సుల్లో 55 శాతం మార్కులు ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. హెల్త్‌ కేర్‌–1 మైక్రో బయాలజీ, జంతు శాస్త్రం విభాగంలో ఖాళీ ఉందని ఆసక్తి గల అభ్యర్థులు 17వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మంగళవా రం మధ్యాహ్నం 2: గంటలకు కళాశాలలో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 99591 51051 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలన్నారు.

ఎంజేపీ విద్యాసంస్థల్లో

టెండర్లకు ఆహ్వానం

జనగామ రూరల్‌: జిల్లాలోని మొండ్రాయి మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చికెన్‌, మటన్‌ సరఫరా, క్యాటరింగ్‌ సేవలకు అలాగే స్టేషన్‌ ఘన్‌పూర్‌ మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో క్యాట రింగ్‌ సేవలకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్‌ ఆకుల శ్రీనివాస్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి గతంలో ఆహ్వానించిన టెండర్లు ఖరారు కానందున, సంబంధిత పనులకు షార్ట్‌ నోటీసు ద్వారా తిరిగి టెండర్లు ఆహ్వానిస్తున్న ట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల అర్హత కలి గిన టెండరు దారులు ఈనెల 17లోపు రూ.1,000 చెల్లించి ఫారాలు అందించాలన్నా రు. వివరాలకు 90528 99229 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

పాలకుర్తి టౌన్‌: ఖోఖో జాతీయ స్థాయి శిక్షణకు మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు, జాతీయ ఖోఖో క్రీడాకారుడు రావుల కుమారస్వామి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ స్పోర్ట్స్‌(ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్‌) లో ఖోఖో కోచ్‌ శిక్షణ ఎంపికల్లో రాష్ట్రం నుంచి నలుగురిని ఎంపిక చేయగా వారిలో కుమారస్వామి ఒకరు. ప్రస్తుతం కుమారస్వామి బెంగుళూరులో స్పోర్ట్స్‌ ఆధారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌)లో కోచ్‌ శిక్షణ అభ్యసిస్తున్నారు. జాతీ య ఖోఖో కోచ్‌ శిక్షణకు ఎంపికై న కుమారస్వామిని గ్రామ సర్పంచ్‌ కారుపోతుల శ్రీనివాస్‌, గ్రామస్థులు అభినందించారు.

పీజీ కళాశాల భవన పనులు వేగవంతం చేయాలి

జనగామ: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని జనగామ పీజీ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను కళాశాల ప్రధానాచార్యులు ఎస్‌.ఎం.రహమాన్‌ బుధవారం పరిశీలించారు. కళాశాల అభివృద్ధి పనుల పురోగతిని పర్యవేక్షించిన ఆయన నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. అదే విధంగా 2026 విద్యా సంవత్సరానికి పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా పీజీ కళాశాలలో ప్రవేశాలు పొందే విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, వాణిజ్యం, సామాజిక సేవా విభాగాల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కళాశాల అభివృద్ధి పనుల పరిశీలనలో బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

తాత్కాలిక అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు..

న్యూశాయంపేట: ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని వరంగల్‌, హనుమకొండ, జనగామలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమ గురుకులాల రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ డీఎస్‌.వెంకన్న బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనగామ జిల్లాలోని పాలకుర్తి బాలికల గురుకులంలో పీజీటీ మ్యాథ్స్‌(01), ఫిజిక్స్‌(01), టీజీటీ ఫిజి కల్‌ సైన్స్‌(1), బయోసైన్స్‌(1), హిందీ(01) లైబ్రేరియన్‌(1) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 21న ఉదయం 9గంటలకు గిరిజన గురుకులం(సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ) పెద్దమ్మగడ్డ, ములుగురోడ్డు, వరంగల్‌లో ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌తోపాటు రెండు జతల జిరాక్స్‌ కాపీలతో డెమో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement