కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్ తన ప్రత్యేకతను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంటోంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రత్యేకంగా విద్యార్థుల చెంతకు సమాచారం అందజేసేందుకు కొత్తగా రెండు డిజిటల్ ఎల్‌ఈడీ బోర్డులు ఏర్పాటు చేశారు. సాధారణంగా అధికారులు తన అఫీషియల్ పోర్టల్ అయిన వెబ్‌సైట్, ఇన్‌స్ర్ట్రాగామ్‌లో కళాశాల ప్రాధాన్యం కలిగిన సమాచారం పొందుపరుస్తుంటారు. ప్రతిరోజూ విద్యార్థులు ఆ వెబ్‌సైట్, ఇన్‌స్ట్రాగామ్‌ను ఓపెన్ చేయడం కుదరకపోవడంతో కీలక సమాచారం మిస్సవుతున్నారు. ఆ చిన్న సమాచారం తెలి యాలన్న ఉద్దేశంతో క్యాంపస్‌లో రెండు డిజిటల్ ఎల్‌ఈడీ బోర్డులు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఎల్‌ఈడీ బోర్డులు తాజా సమాచారాన్ని తెలియజేస్తుంటాయి. అదే విధంగా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, పేపర్ ప్రజంటేషన్,పేటెంట్ హక్కులు సాధించిన వారి వివరాలతోపాటు క్యాంపస్‌లో చోటుచేసుకునే వివరాలను తెలుసుకునేందుకు కేరాఫ్‌గా డిజిటల్ ఎల్‌ఈడీ సమాచారం నిలుస్తోంది.
విద్యార్థుల చెంతకు..
నిట్ వరంగల్‌లో బీటెక్, ఎంటెక్, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు సుమారు 6,500 మంది విద్యనభ్యసిస్తున్నారు. కాలి నడకన, సైక్లింగ్‌లో కళాశాల తరగతి గదులు, ల్యాబ్స్, ఆడిటోరియం, హాస్టల్స్, కెఫెలకు వెళ్తుంటారు. ఇక్కడికి మెయిన్ బిల్డింగ్, కలాం గెస్ట్‌హౌజ్ వద్దనుంచి వెళ్లాల్సి ఉంటుండడంతో ఆ డిజిటల్ బోర్డుల్లో ప్లే అవుతున్న సమాచారాన్ని ఆసక్తిగా తిలకిస్తూ తమకు అవసరమైన వాటిని నోట్ చేసుకుంటున్నారు.
నిట్‌లో కొత్తగా డిజిటల్ ఎల్‌ఈడీల ఏర్పాటు..
ఆసక్తిగా తిలకిస్తూ సమాచారం
తెలుసుకుంటున్న విద్యార్థులు


