అభివృద్ధిలో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

Aug 13 2026 1:09 AM | Updated on Aug 13 2026 1:09 AM

నర్మెట: గ్రామాల అభివృద్ధిలో అధికారులు, సర్పంచ్‌లు సమన్వయంతో వ్యవహరించి భాగస్వాములు కావాలని అదనపు డీఆర్డీఓ, మండల ప్రత్యేక అధికారి నాగ శేషాద్రిసూరి అన్నారు. మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్‌ అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో అయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయా శాఖ అధికారులు నివేదికలు వినిపించిన అనంతరం జీపీల సమగ్ర అభివృద్ధిపై నిర్వహించిన చర్చలో సర్పంచ్‌లు, కార్యదర్శులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పంట క్వాలను శుభ్రంచేయాలని, ఓహెచ్‌ఎస్సార్‌ ట్యాంకుల మరమ్మతులు చేపట్టాలని సర్పంచ్‌ శ్రీధర్‌గౌడ్‌ సభ దృష్టికి తీసుకువచ్చారు. తహసీల్దార్‌ రామానుజాచార్యులు, ఎంపీఓ సంపత్‌ కుమార్‌, ఎంఓ శ్రీ తేజ, ఏఓ బుర్రా మమత, ఏఈలు ప్రజ్వ ల్‌, శ్రీని వాస్‌, సర్పంచ్‌లు హైమ, రేఖ, చిన్నపురెడ్డి, బుజ్జి, మహేందర్‌, రమేశ్‌, కార్యదర్శులు పాల్గొన్నారు.

అదనపు డీఆర్డీఓ నాగ శేషాద్రి సూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement