లింగాలఘణపురం: మండలంలోని జనగామ – సూర్యాపేట రోడ్డులోని సర్వే నంబర్ 431లో గల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాగా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా విచారణ చేసి స్వాధీ నం చేసుకొని బోర్డును ఏర్పాటు చేశారు. సర్వే నంబర్ 431లో మొత్తం 16.02 ఎకరాలు ఉండగా అందులో 2.20 గుంటలు తనకు రావాలని నెల్లుట్లకు చెందిన పసుల లక్ష్మి ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో పూర్తిస్థాయిలో విచారణ జరిపిన కలెక్టర్ సంబంధిత రికార్డులను పరిశీలించి ప్రభు త్వ భూమిగా గుర్తించి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఆ సర్వే నంబర్‌లో గతంలో కొంతమందికి ప్రభుత్వం అసైన్డ్ చేసినట్లు సమాచారం. అందులో కేవలం 5 ఎకరాల భూమికి సంబంధించి వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఆక్రమణకు గురైన కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ప్రభుత్వానికి స్వాధీనం చేయడం గమనార్హం.


