కొండా లక్ష్మణ్‌ అవార్డు అందుకున్న రాజేశ్వరి | - | Sakshi
Sakshi News home page

కొండా లక్ష్మణ్‌ అవార్డు అందుకున్న రాజేశ్వరి

Aug 8 2026 1:23 AM | Updated on Aug 8 2026 1:23 AM

బచ్చన్నపేట : చేనేత రంగంలో విశేష నైపుణ్యం కనబర్చిన మండలంలోని గోపాల్‌నగర్‌ గ్రామానికి చెందిన నేత కళాకారిణి సకినాల రాజేశ్వరి.. కొండా లక్ష్మణ్‌ బాపూజీ చేనేత అవార్డును అందుకున్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో పీపుల్స్‌ ప్లాజాలో చేనేత జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ.. జిల్లాలో కేవలం ఒక మహిళా చేనేత కార్మికురాలిగా ఎంపికయ్యానని సంతోషం వ్యక్తం చేశారు. చేనేతలో సంప్రదాయ పద్ధతులను అవలంబిస్తూ టై అండ్‌ డై చీరలను నేశానన్నారు. ఆమె వెంట భర్త రాజు పలువురు ఉన్నారు.

తెగుళ్ల నివారణకు సకాలంలో చర్యలు తీసుకోవాలి

పాలకుర్తి టౌన్‌: పంటల్లో పురుగులు, తెగుళ్ల నివారణకు సకాలంలో చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ వి.రమ్య, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంబికా సోని సూచించారు. శుక్రవారం మండలంలోని గూడూరులో వరి, పత్తి, మొక్కజొన్న, పశుగ్రాస జొన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల ఎదుగుదలకు రెండు శాతం యూరియా ద్రావణం లేదా 19:19:19 ఎరువు ద్రావణంతో పాటు నానో డీఏపీ, నానో యూరియా పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఏఈలు సువర్ణ, దీపక్‌ పాల్గొన్నారు.

చేనేత కార్మికులు

ఐక్యంగా ఉండాలి

జనగామ: చేనేత కార్మికులంతా పార్టీలకతీతంగా ఐక్యంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చేనేత సంఘ ప్రతినిధి బల్ల శ్రీనివాస్‌ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని బాణా పురం కాలనీలో మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చేనేత కళా కారుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత రంగ పరిరక్షణతో పాటు కళాకారుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా చేనేత రంగానికి విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రజాప్రతినిధులు, కళా కారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు దోర్నాల వెంకన్నఅనిత, ఎనగందుల కృష్ణఅనూష, కట్కూరు సర్పంచ్‌ బల్ల రవీంద్ర, ప్రొఫెసర్‌ గడ్డం భాస్కర్‌, ఘణపురం కార్తీక్‌, వల్లాల ఉపేందర్‌, బిజ్జా రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

టీపీసీసీ సోషల్‌ మీడియా రాష్ట్ర కన్వీనర్‌గా ఉజ్వల్‌రెడ్డి

జనగామ: మండలంలోని చౌడారం గ్రామానికి చెందిన కర్ల ఉజ్వల్‌రెడ్డికి టీపీసీసీ కమిటీ సోషల్‌ మీడియా విభాగంలో రాష్ట్ర కన్వీనర్‌గా కీలక బాధ్యతలు దక్కాయి. ఈ మేరకు ఆయన్ను రాష్ట్ర కన్వీనర్‌గా నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ నియామక ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉజ్వల్‌రెడ్డి మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించిన పార్టీ జాతీయ నాయకత్వానికి, సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా పార్టీ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement