జనగామ: జిల్లాలోని 15 పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థులకు యోగా, సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ అందించేందుకు తాత్కాలిక పద్ధతిలో మాస్టర్ల నియామకా నికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 9వ తేదీ ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లో అభ్యర్థులకు రాతపరీక్ష, డెమో, ఆ తర్వాత ఇంట ర్వ్యూలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఏడీ శ్రీని వాస్ తెలిపారు. మూడు దశల్లో అభ్యర్థుల ప్రతిభ ను అంచనావేసి తుది ఎంపిక చేపట్టనున్నారు.
30 మంది నియామకం
జిల్లాలోని 15 పీఎంశ్రీ పాఠశాలల కోసం 15 మంది యోగా మాస్టర్లు, 15 మంది సెల్ఫ్ డిఫెన్స్ మాస్టర్లను నియమించనున్నారు. ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానించగా యోగా మాస్టర్ పోస్టులకు 27 మంది, సెల్ఫ్ డిఫెన్స్ మాస్టర్ పోస్టులకు 38 మంది దరఖాస్తు చేశారు. అందుబాటులో ఉన్న పోస్టులతో పోలిస్తే పోటీ నెలకొనడంతో ఎంపిక ప్రక్రియను పూర్తిగా ప్రతిభ ఆధారంగా నిర్వ హిస్తున్నారు. ఎంపికై న యోగా మాస్టర్లకు 10 నెలల పాటు నెలకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తారు. వీరు సంబంధిత పీఎంశ్రీ పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహిస్తూ అన్ని తరగతుల విద్యార్థులకు యోగా శిక్షణ అందించాల్సి ఉంటుంది. సెల్ఫ్ డిఫెన్స్ మాస్టర్లు మార్షల్ ఆర్ట్స్, కరాటే, కుంగ్‌ఫూ, జూడో, తైక్వాండో, కలరిపయట్టు వంటి విద్యల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఏడాది కాలంలో 72 సెషన్లు నిర్వహించాల్సి ఉండగా, ఇందుకు మొత్తం రూ.30 వేల గౌరవ వేతనం అందజేయనున్నారు. బాలికల్లో ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించడం ఈ కార్యక్రమం ఉద్దేశం.
రేపు యోగా, సెల్ఫ్ డిఫెన్స్ మాస్టర్ల
నియామక పరీక్షలు
15 పీఎంశ్రీ పాఠశాలలకు
30 తాత్కాలిక పోస్టులు


