రఘునాథపల్లి: మండలంలోని ఖిలాషాపూర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్(పీజీఐ) రాష్ట్ర పరిశీలన బృందం శుక్రవారం ఆకస్మికంగా సందర్శించింది. ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి (అడిషనల్ కలెక్టర్) సదానందం నేతృత్వంలోని పాఠశాలల్లో విద్యా కార్యక్రమాల అమలు, పురోగతి అంశాలపై తనిఖీ చేశారు. రెండేళ్లుగా విద్యార్థుల నమోదు, పెరుగుదల, ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఐపీ కార్యక్రమాల అమలు, తెలుగు– ఆంగ్లం చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలు, ఫాస్ట్ మ్యాథ్స్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, మధ్యాహ్న భోజనం, డిజిటల్ బోధన, ప్రాజెక్టు ఆధారిత బోధన తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర బృందం సభ్యులు ఏఎంఓ ప్రభాకర్‌రెడ్డి, ఎంఈఓ చలపతి, డీఆర్పీ ప్రవీణ్, రఘునాథపల్లి ఎంఈఓ రఘునందన్‌రెడ్డి, హెచ్‌ఎంలు భారత రవీందర్, ఎం.యాదవరెడ్డి, సీఆర్‌పీ శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


