● నాబార్డు జిల్లా అబివృద్ధి మేనేజర్
(డీడీఎం)విజయ్‌కుమార్
చిల్పూరు: రైతులకు మరింత ప్రయోజనం కల్పించేలా ఎఫ్‌పీఓ(ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) పనిచేయాలని నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్(డీడీఎం)విజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని రాజవరం గ్రామంలో నాబార్డు సహకారంతో జనవికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజవరం రైతు ఉత్పత్తి దారుల సంస్థను శుక్రవారం సాయంత్రం డీడీఎం సందర్శించారు. ఈసందర్భంగా ఎఫ్‌పీఓ చైర్మన్ కాల్వ కృష్ణారెడ్డితో సమావేశమై రైతులకు అందిస్తున్న సేవలు, భాగస్వామ్యం, భవిష్యత్తు కార్యకలాపాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాబార్డు ఇంటర్న్‌షిప్‌లో భాగంగా కావ్య స్వశక్తి మహిళా సంఘాల సభ్యులతో సమావేశమై వారి ఆర్థిక స్థితిగతులపై బేస్‌లైన్ సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో జేవీఆర్‌డీఎస్ సీఈఓ సంపత్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.


