వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పలుచోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రాత్రి వర్షం కురుస్తుంది.
జనగామ రూరల్: ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను భావితరాలకు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి కార్యక్రమాన్ని జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా జయశంకర్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్, మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి ఎన్.ఎల్.నరసింహరావు, వైటీడీఏ సభ్యుడు లక్ష్మీనారాయణ నాయ క్, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి, జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రామేశ్వరచారి, ఆరే కుల క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షుడు లింగాజి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి హరీష్, బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు గంగ భవాని, కన్నా పరశురాములు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సాధనలో
‘సార్’ పాత్ర మరువలేనిది: పల్లా
జనగామ: తెలంగాణ సాధనలో జయశంకర్ సార్ పాత్ర మరువలేనిదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా పట్టణంలోని 11వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత బలాన్ని అందించిన మహనీయుడని కొనియాడారు. పట్టణంలో తన సొంత ఖర్చులతో జయశంకర్ సార్ విగ్రహాన్ని ఏర్పా టు చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అనూషక్రిష్ణ, రజిత, సేవెల్లి మధు, దుర్గాప్రసాద్, ఉడుగులు కిష్టయ్య, నాయకులు బండ యాదగిరిరెడ్డి, ఎండీ సమ్మ ద్, ముస్త్యాల దయాకర్, మామిడాల రాజు, ఉల్లెంగుల సందీప్, ఉల్లెంగుల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.


