వేధింపుల నివారణతోనే మహిళా భద్రత | - | Sakshi
Sakshi News home page

వేధింపుల నివారణతోనే మహిళా భద్రత

Aug 7 2026 1:08 AM | Updated on Aug 7 2026 1:08 AM

జనగామ: లైంగిక, సైబర్‌ వేధింపుల వంటి నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరిలోనూ అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గద్వాల విజయలక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ సమావేశం హాలులో జాతీయ మహిళా కమిషన్‌, రాష్ట్ర మహిళా కమిషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాతో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. లైంగిక, సైబర్‌ వేధింపులకు గురైన మహిళలు భయపడకుండా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని, సఖి కేంద్రాలు, పోలీసులు, న్యాయ సహాయ సేవలను విని యోగించుకోవాలని సూచించారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ.. యువతులను వెంబడించడం, పదేపదే సందేశాలు పంపడం, కళాశాలలు, కార్యాలయాల వద్ద వేచి ఉండడం, నకిలీ సోషల్‌ మీడియా ఖాతాలతో వేధించడం వంటి చర్యలు చట్టరీత్యా నేరాలని స్పష్టం చేశారు. సైబర్‌ వేధింపులు ఎదురైతే స్క్రీన్‌ షాట్లు భద్రపరచి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, మౌనం వేధింపుదారులకు అవకాశమిస్తుందని హెచ్చరించారు. 100,112,181,1098,1930 సేవలను సద్వియోగం చేసుకోవాలన్నారు. అనంతరం లైంగిక, సైబర్‌ వేధింపుల నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌, డీడబ్ల్యూఓ బెన్‌షాలోమ్‌, మహిళా కమిషన్‌ సెక్రెటరీ పద్మజారమణ, మానసిక వైద్య నిపుణుడు శ్రీధర్‌ రాజు, మహిళా కమిషన్‌ సభ్యులు కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళయాదవరెడ్డి, ఎన్‌.రాధాభాయ్‌, సదాలక్ష్మి, ఏసీపీ నర్సయ్య, అదనపు డీసీపీ బాలస్వామి, వెంకటరమణ తదితరులు ఉన్నారు.

రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు, మెరుగైన మౌలిక వసతులు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి సూచించారు. జిల్లా పర్యటన నేపథ్యంలో పట్టణంలోని జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని ఆమె సందర్శించి, వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రతను పరిశీలించారు. మహిళా సర్జికల్‌, మెడికల్‌ వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, వైద్యసేవలు, వైద్యుల పర్యవేక్షణ, డిశ్చార్జ్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. భర్త చేతిలో గాయపడి చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించి, దాడికి పాల్పడిన ఒక్కరిపై కాకుండా అందరిపై కేసు నమోదు చేయాలని ఏసీపీని ఆదేశించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద ఉన్న బాలసదనాన్ని సందర్శించిన చైర్‌పర్సన్‌ అక్కడి చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌, డీడబ్ల్యూఓ బెన్షాలోమ్‌, కార్యదర్శి బి.పద్మజారమణ, ఏసీపీలు భీంశర్మ, నర్సయ్య, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ రాజలింగం, డీసీపీఓ రవికాంత్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు 8, 9 పేజీల్లో

బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి

లైంగిక, సైబర్‌ వేధింపులపై

అవగాహన పెంచుకోవాలి

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌

విజయలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement