విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

Aug 7 2026 1:08 AM | Updated on Aug 7 2026 1:08 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు బాధ్యతగా కృషి చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. మండలంలోని నమిలిగొండ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నూతనంగా రూ.2.50లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్‌, రూ.50వేలతో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా రూ.40లక్షలతో నిర్మాణం చేయనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠశాలకు తాను చేసిన హామీలను నెరవేర్చానని, ఇంకా ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు.

ఇంగ్లిష్‌ గ్రామర్‌ బోధించిన ఎమ్మెల్యే

కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే కడియం పాఠశాలలోని 8వ తరగతి గదిని సందర్శించారు. ఆ సమయంలో విద్యార్థులకు టీచర్‌ ఇంగ్లిష్‌ బోధిస్తుండగా స్వయంగా లెక్చరర్‌ అయిన ఎమ్మెల్యే కడియం కాసేపు విద్యార్థులకు ఇంగ్లిష్‌ గ్రామర్‌ బోధించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తాటికొండ వినయ్‌కుమార్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ లావణ్యశిరీషరెడ్డి, నమిలిగొండ సర్పంచ్‌ పురమాని కోమలఐలోనియాదవ్‌, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు బెలిదె వెంకన్న, పురమాని రజాక్‌యాదవ్‌, పోశాల కృష్ణమూర్తి, పాఠశాల ఎస్‌ఓ రజిత, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శిరీష్‌రెడ్డి, పట్టణఽ అఽఽధ్యక్షుడు కిషన్‌రాజు, కౌన్సిలర్లు, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement