బచ్చన్నపేట: మండలంలోని గోపాల్‌నగర్ గ్రామానికి చెందిన చేనేత కళాకారిణి సకినాల రాజేశ్వరి రాష్ట్ర ప్రభుత్వ కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 7న (శుక్రవా రం) జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొ ని హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకల్లో చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఇతర రాష్ట్ర అధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
సంస్థల శిక్షణతో ప్రోత్సాహం..
మండల కేంద్రంలో పెర్నోడ్ రికార్డ్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారు సీఎస్‌ఆర్ ఆర్థిక సహాయంతో యూనైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, వారి క్నౌలెడ్జ్ పార్టనర్ పల్లె సృజన సంస్థలు నిర్వహించించిన ప్రీ హ్యాండ్లూమ్ డిజైనింగ్ శిక్షణ కార్యక్రమానికి సకినాల రాజేశ్వరి ఎంపికై అందులో నైపుణ్యం సాధించారు. మండల కేంద్రంలో టెక్నికల్ శిక్షకుడు చింతకింది మల్లేశం నిర్వహించిన 40 రోజుల శిక్షణ కార్యక్రమంలో దాదాపు 50 మంది మహిళలు పాల్గొనగా కేవలం రాజేశ్వరి ఒక్కరే పట్టుదలతో నేతను నేర్చుకున్నారు. ఈసందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని తెలిపారు. పేదరికంలో ఉన్నప్పటికీ శిక్షణకు వెళ్లడానికి, మెలకువలు నేర్చుకోవడానికి భర్త రాజు ప్రోత్సాహం అందించారన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు
చేనేత కళాకారిణి రాజేశ్వరి ఎంపిక


