పీజీఐ–డీలో అగ్రస్థానమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పీజీఐ–డీలో అగ్రస్థానమే లక్ష్యం

Aug 6 2026 12:57 AM | Updated on Aug 6 2026 12:57 AM

జనగామ: జిల్లాలో విద్యానాణ్యతను మెరుగుపరిచి, పర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌ ఫర్‌ డిస్ట్రిక్ట్‌స్‌ (పీజీఐ–డీ)లో జాతీయ స్థాయిలో అగ్రస్థానం సాధించేందు కు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌, విద్యాశాఖ అధికారి సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మి షన్‌ శిఖరం సమీక్ష సమావేశంలో ఎంఈఓలు, హెడ్‌మాస్టర్లు, క్లస్టర్‌ హెడ్‌మాస్టర్లతో ఆయన మాట్లాడారు. జనగామ జిల్లా 600 మార్కులకు 383 మా ర్కులు సాధించి తెలంగాణలో ఏకై క ఉత్తమ్‌–3 గ్రేడ్‌ జిల్లాగా నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. ముఖ్యంగా లెర్నింగ్‌ అవుట్‌ కమ్స్‌లో 290కి 188 మార్కులతో రాష్ట్రంలో తొలిస్థానం సాధించినందుకు విద్యాశాఖ అధికారులను అభినందించారు. అయితే డిజిటల్‌ లెర్నింగ్‌, గవర్నెన్స్‌, స్కూల్‌ సేఫ్టీ, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అంశాల్లో పురోగతి సాధించాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఐసీ టీ పరికరాలు, ఇంటర్నెట్‌, దీక్షా వేదిక వినియోగం పెంచాలని, స్కూల్‌ సేఫ్టీ కమిటీలు, పోక్సో కమిటీలు, ఫిర్యాదు పెట్టెలు, సెల్ఫ్‌ డిఫన్స్‌, అగ్నిప్రమాదా లు, విపత్తు నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. యూడైస్‌ సమాచారం పూర్తిస్థాయిలో నమోదు చేయడం, ఈ– అటెండెన్స్‌, ఎస్‌ఎంసీ సమావేశాలు, స్కూల్‌ డెవలప్‌ మెంట్‌ ప్లాన్లు, యూసీలు పెండింగ్‌ లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ప్రతీ పాఠశాలను నెలకోసారి తనిఖీ చేసి, వివరాలను 24 గంటల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ప్రతీ ఉపాధ్యాయు డు ఏడాదికి కనీసం 50 గంటల సీపీడీ శిక్షణ పూర్తి చేయాలని తెలిపారు. విద్యార్థుల్లో ఫౌండేషనల్‌ లిట రసీ అండ్‌ న్యూమరసీ నైపుణ్యాలు, హాజరు శాతం పెంపు, బడిబయట పిల్లలను బడిలో చేర్పించడం, టెన్త్‌ నుంచి ఇంటర్‌కు 100 శాతం మార్పిడిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్‌, జీసీడీఓ గౌసియాబేగం పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు మేలు

పాలకుర్తి టౌన్‌(దేవరుప్పుల): ఎల్‌నినో పరిస్థితులు, భూగర్భ జలాల పరిరక్షణ దృష్ట్యా రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో అధిక లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచించారు. దేవరుప్పల మండలం నీర్మాల గ్రామంలో ప్రగతిశీల రైతు నరేందర్‌రెడ్డి వ్యవసాయ సాగును పరిశీలించి రైతుతో మాట్లాడారు. నువ్వులు, కందులు, పెసర్లు, మినుములు, కుసుమ, ఆముదం వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ, డ్రిప్‌ ఇరిగేషన్‌, పంటల ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించి రైతులు అధిక ఆదాయం పొందవచ్చని అన్నారు. అనంతరం నీర్మాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. విద్యాప్రమాణాలు, చిన్నారుల పోషణ, పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి విద్యార్థులకు యూనిఫామ్‌ పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో డీఏఓ అంబికా సోని, ఎంఏఓ మనోహిత్‌, ఏఈఓ సాయి కిరణ్‌, సర్పంచ్‌ సంధ్యారాణి, రైతులు పాల్గొన్నారు.

సమీక్షలో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement