● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జఫర్‌గఢ్: పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. మండల కేంద్రంలో శుక్రవా రం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కడియం శ్రీ హరి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జఫర్‌గఢ్ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనంటూ పేర్కొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి జఫర్‌గఢ్ మీదుగా వర్ధన్నపేట వరకు రూ.40 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డు, సెంట్రల్ లైటింగ్ మంజూరు కావడం జరిగిందని, త్వరలో ఈ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వేల్పుగొండ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేయడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుల్లా మోహన్‌రావు, సింగిల్ విండో చైర్మన్ తీగల కర్ణాకర్‌రావు, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, పార్టీ జిల్లా నాయకులు అన్నెబోయిన భిక్షపతి, ఇల్లందుల బేబి శ్రీనివాస్, మంచాల ఎల్లయ్య, మనోజ్‌రెడి పాల్గొన్నారు.


