జనగామ: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవా రం బస్సుల కొరతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద యం నుంచి రాత్రి వరకు పలు మార్గాల్లో బస్సులు సకాలంలో రాకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు నుంచి మూడు గంటల పాటు ఒక టి, రెండు బస్సులు మినహా మిగతా సర్వీసులు లేకపోవడంతో ప్లాట్‌ఫారాలు ప్రయాణికులతో కిక్కిరిశాయి. సిద్దిపేట, నర్మెట, సూర్యాపేట, రఘునాథపల్లి, పాలకుర్తి, హనుమకొండ, ఉప్పల్, జగద్గిరిగుట్ట, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు 60 నుంచి70 శాతం తగ్గడంతో ఇబ్బందులు మరింత పెరిగాయి. వచ్చిన కొద్దిపాటి బస్సుల్లో సీట్లు దక్కించుకునేందుకు ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ఖమ్మంలో సీఎం సభకు బస్సులు తరలించడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు పలువురు ప్రయాణికులు అభిప్రాయపడ్డారు.


