ఆయుర్వేద వైద్యశిబిరానికి స్పందన | - | Sakshi
Sakshi News home page

ఆయుర్వేద వైద్యశిబిరానికి స్పందన

Jul 12 2026 1:17 AM | Updated on Jul 12 2026 1:17 AM

జనగామ: పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డు ఏకశిల బీఈడీ కళాశాల ఎదురుగా ఉన్న వేద ఆయుర్వేద పంచకర్మ వెల్‌నెస్‌ ఆస్పత్రిలో శనివారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఆస్పత్రి డాక్టర్‌ అంజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఆయుర్వేద వైద్యులతో పాటు హైకోర్టు న్యాయవాది, బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామ సర్పంచ్‌ బల్ల రవీంద్రనాథ్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శిబిరంలో జనగామలో తొలిసారి ఆయుర్వేద మల ద్వారా శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ చెన్నా అభిలాష్‌ నేతృత్వంలో అర్షమొలలు తదితర పగుళ్ల సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్‌ బి.శివ ఆధ్వర్యంలో చెవి ముక్కు, కన్ను, గొంతు సంబంధిత సమస్యలను పరిశీలించగా, కంటి వైద్య నిపుణుడు డాక్టర్‌ అక్షయ్‌, డాక్టర్‌ హర్ష రోగులను పరీక్షించారు. మొత్తం 220 మందికి అన్ని రకాల పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మౌనిక, తనుజ, అర్పిత, వెంకటేష్‌, శివ, సాయి, ఉదయ్‌, రజిత, రమ్య, యేలేంద్ర, శ్రీలత, వంశీ, సిబ్బంది పాల్గొన్నారు.

220 మందికి వైద్యసేవలు,

మందుల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement