రూ.1.50 కోట్లపై ఆరా! | - | Sakshi
Sakshi News home page

రూ.1.50 కోట్లపై ఆరా!

Jul 12 2026 1:17 AM | Updated on Jul 12 2026 1:17 AM

MýSÌñæ-MýSt-ÆŠæ M>Æ>Å-ÌSĶæ$ ˘

ఖాతాల్లోని నిధులపై విచారణ

జనగామ: జనగామ కలెక్టరేట్‌లో అప్పటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మరో కీలక అంశం తెరపైకి వచ్చినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే దిక్సూచి పుస్తకాల ముద్రణ పేరిట సుమారు రూ.40 లక్షల వ్యయానికి సంబంధించిన అవకతవకలపై ప్రస్తుత కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ప్రత్యేక దృష్టి సారించగా, అప్పటి కలెక్టరేట్‌ ఏఓ శ్రీకాంత్‌పై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారం ఇంకా విచారణలో ఉండగానే కలెక్టరేట్‌ కా ర్యాలయ ఖాతాల్లోని మరో రూ.1.50 కోట్ల నిధుల వినియోగంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఏ ఏ కార్యక్రమాలకు ఖర్చు చేశారు?

గతంలో కలెక్టర్‌ కార్యాలయ ఖాతాల్లో ఉన్న ఈ నిధులు ఏ ఏ కార్యక్రమాలకు ఖర్చు చేశారు, సంబంధిత పరిపాలన అనుమతులు ఉన్నాయా, వ్యయానికి సంబంధించిన పూర్తి లెక్కలు, ఓచర్లు, ఆడిట్‌ రికార్డులు అందుబాటులో ఉన్నాయా? అనే అంశాలపై పరిశీలన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నిధులపై క్రమబద్ధమైన ఆడిట్‌ జరిగిందా? లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కలెక్టరేట్‌ పరిధిలోని ఖాతాల్లోని నిధులను ప్రభుత్వ బ్యాంకుల్లోనే నిర్వహించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, గతంలో రెండు ప్రైవేట్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసినట్లు సమాచారం. ఈ అంశంపై వెంటనే స్పందించిన ప్రస్తుత కలెక్టర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఖాతాలను ప్రభుత్వ రంగ బ్యాంకులకు మార్చారు. ఈ మార్పు వెనుక ఆర్థిక పారదర్శకత, ప్రభుత్వ నిబంధనల అమలే ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. ఇక మరో ఆసక్తికర అంశంగా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఫిబ్రవరి 26న బాధ్యతలు స్వీకరించినప్పటికీ, ఆయన డిజిటల్‌ సంతకం ఆన్‌లైన్‌ వ్యవస్థలో వారం నుంచి ఎనిమిది రోజుల తర్వాత మాత్రమే నమోదు అయినట్లు సమాచారం. ఈ ఆలస్యానికి గల కారణాలపై కూడా అంతర్గతంగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఆ సమయంలో ఎలాంటి పరిపాలనా లేదా ఆర్థిక లావాదేవీలు జరిగాయా అనే కోణంలో పరిశీలన కొనసాగుతున్నట్లు సమాచారం. దిక్సూచి వ్యవహారం తర్వాత ఇప్పుడు రూ.1.50 కోట్ల నిధుల వినియోగంపై కూడా కలెక్టరేట్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆరోపణలపై అధికారిక విచారణ పూర్తయిన తర్వాతనే పూర్తి వివరాలు బయటకు వస్తాయని తెలుస్తుంది.

ప్రైవేట్‌ బ్యాంకుల నుంచి

ప్రభుత్వ బ్యాంకులకు మార్పు

డిజిటల్‌ సంతకం ఆలస్యంపైనా నిఘా

అక్రమాలపై కఠిన చర్యలకు కలెక్టర్‌

సందీప్‌ కుమార్‌ ఝా సంకేతాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement