జిల్లాలో ప్రజాధనం వినియోగంలో పూర్తి పారదర్శకత ఉండాలి. ప్రజలకు మేలు చేసే పనులనే అమలు చేస్తున్నాం. మాకు ఎలాంటి భయం లేదు. తప్పు చేయడం లేదనే నమ్మకం ఉంది. ప్రతీ ఉద్యోగి అంకితభావంతో పని చేయాలి. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే శాఖాపరమైన చర్యలతో పాటు అవసరమైతే నేరుగా ఏసీబీకి కూడా రాస్తాం. ఖాతాలను ప్రైవేట్ బ్యాంకుల నుంచి ప్రభుత్వ బ్యాంకులకు మార్పించాం. కలెక్టర్ కార్యాలయ ఖాతాలకు సంబంధించి రూ.1.50 కోట్ల నిధుల ఖర్చుపై ఆరా తీస్తాం. ఆడిట్ జరిగిందా లేదా అనే కోణంలో పరిశీలన చేస్తాం.
– సందీప్‌కుమార్ ఝా, కలెక్టర్


