జనగామ: మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు టౌన్ లెవల్ ఫెడరేషన్ (టీఎల్‌ఎఫ్) ద్వారా 30 మంది పారిశుద్ధ్య కార్మికులను రోజువారీ వేతన ప్రాతిపదికన నియమించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ అర్హులైన అభ్యర్థుల నుంచి ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల ను స్వీకరిస్తామన్నారు. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని, పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికై న వారికి రోజుకు రూ.400 వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. నియామకాలు పూర్తిగా తాత్కాలికమైనవని, భవిష్యత్‌లో శాశ్వత ఉద్యోగంపై ఎ లాంటి హక్కు ఉండదన్నారు. దరఖాస్తు ఫారాలు జనగామ మెప్మా కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయన్నారు.


