కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పరిపాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. జిల్లా విద్యాశాఖలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై దృష్టి సారించి, వాటిని ఒక్కొక్కటిగా వెలికితీస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవడం ఉపాధ్యాయుల్లో విశ్వాసాన్ని పెంచుతోంది. ప్రజాధనాన్ని దుర్వి నియోగం చేసిన వారెవరైనా చట్టపరమైన చర్య ల నుంచి తప్పించుకోలేరనే సందేశాన్ని జిల్లా యంత్రాంగానికి స్పష్టంగా తెలియజేస్తున్నారు. విద్యాశాఖలో వెలుగు చూసిన ’దిక్సూచి’ కెరీర్ గైడెన్స్ కార్యక్రమం సంబంధించి రూ.46.50 లక్షలు దిగమింగిన తిమింగలాల భరతం పట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
–బుర్ర రమేశ్, రాష్ట్ర కార్యదర్శి,
ప్రధానోపాధ్యాయుల సంఘం


