కొడకండ్ల: మండల కేంద్రంలోని కస్తూర్బాలో ఎంఎల్‌టీ కోర్సు బోధించేందుకు గెస్ట్ అధ్యాపక పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఎస్‌ఓ జ్యోతి గురువారం ఒక ప్రకటనలో కోరారు. బీఈడీలో ఇంగ్లిష్ మెథడాలజీ కలిగి ఉండి ఎంఎస్సీ మైక్రోబయాలజీ పీజీ అర్హత కలిగి ఉన్న వారు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు బోధించాల్సి ఉంటుందని, అసక్తి కలిగిన వారు ఈ నెల 15 వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులకు డెమో నిర్వహించి ఎంపిక చేస్తామని, నెలకు గౌరవ వేతనం రూ.22వేలు ఉంటుందని, వివరాల కోసం 95057 98098, 99084 13707 నంబర్లకు ఫోన్ చేయవచ్చని ఆమె సూచించారు.
నేడు ఫుడ్ లైసెన్స్
రిజిస్ట్రేషన్ మేళా
జనగామ రూరల్: రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కోసం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా ఈనెల 12న(శుక్రవారం) నిర్వహించనున్నట్లు ఆహార భద్రత అధికారి సీహెచ్ వినీల్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. కలెక్టరేట్ రూమ్ నెంబర్ ఏ2లో ఉద యం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారని ఆహార వ్యాపార నిర్వాహకులు సద్వినియోగం చేసుకొని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ రిజిస్ట్రేషన్లు పొందడం, రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఆహార భద్రత అధికారి: 7306335795, గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్: 9985820544 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
మిత్రుడి కుటుంబానికి
ఆర్థిక సాయం
రఘునాథపల్లి: మండల కేంద్రానికి చెందిన తాళ్లపల్లి రాజ్‌కుమార్ ఇటీవల మృతిచెందగా అతడి కుటుంబానికి మిత్రులు అండగా నిలి చారు. రాజ్‌కుమార్ కుటుంబం ఎదుర్కొంటు న్న క్లిష్ట పరిస్థితులను గుర్తించి హనుమకొండకు చెందిన ఫార్మా ఫ్రెండ్స్ మిత్ర బృందం గురువారం రూ.1,03,000ల ఆర్థిక సాయం అందించింది. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి ప్రకటించింది.
14న జిల్లా స్థాయి
ఓపెన్ టు ఆల్ చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: ఉమ్మడి వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 14న కల్నల్ సంతోశ్‌బాబు స్మారక ఓపెన్ టు ఆల్ చదరంగం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహణ కార్యదర్శి కన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను హనుమకొండ రెడ్డి కాలనీలోని మాస్టర్జీ వికాస్ హైస్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అండర్–10, 12, 14 బాలబాలికల విభాగం నుంచి ఇద్దరి చొప్పున రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జూలై 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ స్థాయి రాపిడ్ రేటింగ్ చదరంగ పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు మొబైల్ 90595 22986 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.
ఆర్టీసీ వరంగల్ డిప్యూటీ ఆర్‌ఎంగా కిషన్‌రావు
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ (మెకానికల్)గా టి.కిషన్‌రావు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేస్తున్న పి.మహేశ్ హైదరాబాద్‌కు బదిలీ కాగా, ఆయన స్థానంలో టి.కిషన్‌రావు వచ్చారు. గురువారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కిషన్‌రావును డిపో మేనేజర్లు, కార్యాలయం సిబ్బంది కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
బాధ్యతల స్వీకరణ
కాశిబుగ్గ: వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్‌గా డాక్టర్ కె.రవిశేఖర్‌రావును నియమించారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఆప్తాల్మజీ విభాగం (నేత్ర వైద్య విభాగం) హెచ్‌ఓడీగా పనిచేసిన ఆయన బదిలీపై వరంగల్‌కు వచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన డాక్టర్ భరత్‌కుమార్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు బదిలీ అయ్యారు.


