వరుస సెలవులు.. కిక్కిరిసిన బస్సులు
జనగామ: క్రిస్మస్ పర్వదినం, బాక్సింగ్ డే సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి క్రిస్మస్ పండుగ కోసం స్వగ్రామాలకు వచ్చిన ప్రజలతో పాటు విహారయాత్రల కోసం వెళ్లే ప్రయాణికులతో జనగామ ఆర్టీసీ బస్టాండు వందలాది మందితో కిటకిటలాడింది. ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్లాట్‌ఫామ్స్ నిండిపోయి..స్థలం లేక ప్రయాణికులు బస్టాండు ప్రాంగణంలో నిలబడిపోయారు. ఒక్కో బస్సులో 80 నుంచి 100 మంది వరకు ప్రయాణం చేశారు.
అమ్మవార్లకు సామూహిక ఒడిబియ్యాలు
దేవరుప్పుల: ఆధ్యాత్మికత చింతన కోసమే ప్రతీనెల వివిధ ప్రాంతాల్లో అమ్మవార్లకు ఒడిబియ్యాలు సమర్పిసున్నట్టు శివశక్తి గ్రూపు ప్రతినిధులు దుద్దెళ్ల అంజమ్మ, బుక్క స్వాతి అన్నారు. గురువారం మండల కేంద్రంలో బుక్కా భాగ్యలక్ష్మీలక్ష్మయ్య దంపతుల ఆధ్వర్యంలో శ్రీ శైవ క్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ తెలంగాణ రాష్ట్రం విభాగం పిలుపు మేరకు తిరుమలగిరి తొండ–2 గ్రూపు ప్రతినిధులు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని శ్రీ రామాలయంలోని అమ్మవార్లకు పలు రకలా ఒడిబియ్యాలతో ఆర్యవైశ్య మహిళలు పెద్దఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు వ్యాపారానికే పరిమితం కాకుండా ఆధ్యాత్మికత, సామాజిక సేవలో భాగంగా ప్రతీ నెల సామూహిక ఒడిబియ్యాలు, అమావాస్య రోజున సామూహిక అన్నదానాలు చేస్తున్నట్టు పేర్కోన్నారు. కార్యక్రమంలో బుక్క భవాణి, వనమాల ఉమ, బుక్క జ్యోతి, జయశ్రీ, వనమాల విజయ, లత, యామ మణి, శ్రీరంగం తులసీ గ్రూపు బండారి విజయ, స్వాతమ్మ పాల్గొన్నారు.
పొలంబాటలో విద్యుత్ సమస్యల పరిష్కారం
స్టేషన్‌ఘన్‌పూర్: విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు పొలంబాట కార్యక్రమాలతో పలు విద్యుత్‌పరమైన సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ట్రాన్స్‌కో స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి సెక్షన్ ఏఈలు పి.శంకర్, శివకుమార్ అన్నారు. ఘన్‌పూర్ సెక్షన్ పరిధిలోని మీదికొండ గ్రామంలో, శివునిపల్లి సెక్షన్ పరిధిలోని ఇప్పగూడెంలో గురువారం విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో రైతు పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈలు మాట్లాడుతూ.. మీదికొండలో ఇప్పటివరకు బ్రేక్‌డౌన్ల సత్వర పరిష్కారానికి 11 కేవీ లైన్‌లో 14 ఏబీ స్విచ్‌లను అమర్చగలిగామన్నారు. ఇప్పగూడెంలో వదులుగా ఉన్న విద్యుత్ లైన్లను గుర్తించి మధ్యలో 50 స్తంభాలను ఏర్పాటుచేశామని, ఒక 63 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లైన్ ఇన్‌స్పెక్టర్లు రామాచారి, ఒడ్డెపల్లి యాదగిరి, కాలురామ్, లైన్‌మన్‌లు పాల్గొన్నారు.
వరుస సెలవులు.. కిక్కిరిసిన బస్సులు


