మల్లన్న ఆలయంలో జాతర ఏర్పాట్ల పరిశీలన
ఐనవోలు: ప్రముఖ శైవక్షేత్రమైన ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతరకు ఏర్పాట్లను గురువారం ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్, వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. పార్కింగ్ స్థలాలు, క్యూలైన్లు, స్నానఘట్టాలు, తాగునీరు, లైటింగ్, సీసీ కెమెరాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం చైర్మన్ కార్యాలయంలో సమావేశమై జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖల అధికారులు సహకరించాలని చైర్మన్ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్, ఆలయ ఈఓ కందుల సుధాకర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నర్మద, ఏసీపీ వెంకటేశ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంట్రా ఏఈ రవి కుమార్, విద్యుత్ శాఖ ఏఈ సురేశ్‌కుమార్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్‌హెచ్‌ఓ పస్తం శ్రీనివాస్, ధర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.


