జనగామ
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
క్రీస్తునామం..భక్తిపారవశ్యం
జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు..పాస్టర్ల శాంతి సందేశాలు
ప్రార్థనలు.. సంబురాలు..
7
జనగామ: జిల్లావ్యాప్తంగా గురువారం క్రిస్మస్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రేమ, శాంతి, సౌబ్రాతృత్వానికి ప్రతీకగా భావించే యేసు క్రీస్తు జననాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదరులు చర్చిలకు తెల్లవారుజాము నుంచే తరలివచ్చారు. ఒకవైపు భక్తిగీతాలు, మరోవైపు పాస్టర్ల శాంతి సందేశాలు మారుమోగగా, లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మించిన పవిత్ర క్షణాలను భక్తులు భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు. జిల్లా కేంద్రం సహా అన్ని మండలాల్లో క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సెంటినరీ ఉండ్రుపుర బాప్టిస్టు చర్చితో పాటు స్టేషన్‌ఘన్‌పూర్, దేవరుప్పుల, నర్మెట, బచ్చన్నపేట, రఘునాథపల్లి ఆయా మండలాల్లోని చర్చిల్లో నిర్వహించిన వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చారు. క్రైస్తవులు కుటుంబాలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
హనుమకొండ రోడ్డులోని సెయింట్‌పాల్స్ అండ్ పీటర్స్ రోమన్ క్యాథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రేయిన్ మార్కెట్‌లోని రూథర్‌ఫోర్డ్ చర్చి, హైదరాబాద్ రోడ్డులోని అబన్‌డెంట్ లైఫ్ చర్చి, ధర్మకంచలోని బేతులే బాప్టిస్టు చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ ప్రత్యేక ఆరాధనల్లో పాస్టర్లు దైవసందేశాన్ని అందజేశారు. రాజీవ్‌నగర్, వీవర్స్ కాలనీ, గిర్నిగడ్డ తదితర ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోని చర్చిల్లో నిర్వహించిన వేడుకల్లో ప్రార్థనలు చేసిన అనంతరం కేక్‌లను కటింగ్ చేశారు.
– మరిన్ని ఫొటోలు 9లోu
జనగామ


