
ఉపాధ్యాయులకు పదోన్నతులు
జనగామ: జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. విద్యారంగంలో కొత్త మార్పులు చోటు చేసుకున్నా యి. 87 మంది ఎస్జీటీలు (సెకండరీ గ్రేడ్ టీచర్లు) వివిధ విభాగా ల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారు. దీంతో హై స్కూల్స్‌లో సబ్జెక్ట్ నిపుణుల కొరత తీరనుండగా.. ప్రాథమిక పాఠశాల పిల్లలకు బోధన పరంగా కష్టాలు ప్రారంభం కానున్నాయి.
సబ్జెక్టుల వారీగా ప్రమోషన్లు
జిల్లాలో సబ్జెక్టుల వారీగా ఎస్జీటీలుగా పదోన్నతులు పొందారు. ఇందులో పీఎస్ హెచ్‌ఎం–22, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ–15, సోషల్ స్టడీస్–24 గణితం–6, ఫిజిక్స్–5, ఇంగ్లిష్–9, తెలుగు–1, హిందీ–2, ఫిజికల్ డైరెక్టర్ –1, స్పెషల్ ఎడ్యుకేషన్–3 ఉన్నారు. ఈ పదోన్నతుల హైస్కూల్ స్థాయిలో ఉపాధ్యాయుల కొరత తీరనుండగా, ప్రాథమిక పాఠశాలల్లో మాత్రం సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రాథమిక పాఠశాలల్లో కొత్త సవాళ్లు
‘బడి బాట’ ద్వారా ఈ ఏడాది ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లోనే అత్యధికంగా అడ్మిషన్లు వచ్చాయి. ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్న పీఎస్‌ల పరిధిలో ఒకరికి ప్రమోషన్ రావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. జిల్లాలోని సుమారు 50 ప్రాథమిక పాఠశాలల్లో ఒకరు పదోన్నతిపై హైస్కూల్ స్థాయికి వెళుతున్నారు. దీంతో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఏర్పడుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఖాళీల భర్తీకి తక్షణమే విద్యావలంటీర్లను నియమించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు అదనపు కలెక్టర్, డీఈఓ పింకేష్‌కుమార్ చేతులమీదుగా ఆర్డర్ కాపీలను అందించగా, వారు విధుల్లో చేరి బాధ్యతలను తీసుకున్నారు.
ఎస్జీటీల పోస్టుల నుంచి 87 మంది ఖాళీ
సుమారు 50 పాఠశాలల్లో ఒకేఒక్కరు
పీఎస్ పరిధిలో ఉపాధ్యాయుల కొరత