
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులనే పూజిద్దాం
జనగామ రూరల్: పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులనే పూజించాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని నెహ్రూ చౌక్ వద్ద మున్సిపాలిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రసాయనాలతో తయారు చేసిన ప్రతిమలతో నీటి కాలుష్యం పెరిగిపోతుందన్నారు. మట్టి ప్రతిమలను పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. అలాగే ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌సీసీ ఆర్మీ వింగ్ 10 బెటాలియన్ కెడెట్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఆర్యభట్టా పాఠశాలలో కరస్పాండెంట్ సురేష్ చంద్ర, ప్రిన్సిపాల్ సృజన ఆధ్వర్యంలో మట్టి వినాయకులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్
మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న
అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్