
మెనూ ప్రకారం భోజనం అందించాలి
తరిగొప్పుల: మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం మండలంలో ఆకస్మిక పర్యటన చేసి కేజీబీవీ, ఇందిరమ్మ ఇళ్లు, ఫర్టిలైజర్ షాపులను పరిశీలించారు. కేజీబీవీలో మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని ఎస్‌ఓ సునీతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలు, పప్పు ధాన్యాలు పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇసుక, కంకర, ఇతర సామగ్రి నిర్ణీత ధరలో లబ్ధిదారులకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫర్టిలైజర్ షాపులోని స్టాక్ రిజిస్టర్‌లు పరిశీలించి యూరియా కొరత సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మొగుళ్ల మహిపాల్‌రెడ్డి, ఎంపీడీఓ ఆలేటి దేవేందర్‌రెడ్డి, ఏఓ మనోహిత్ విక్రమరావు, ఎంపీఓ మాలతి, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.