
ఆరు నెలల నుంచి వేతనం లేదు..
పట్టణంలోని ఎస్సీ ఏ హాస్టల్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఏడాది నుంచి పనిచేస్తున్న. ఆరు నెలల నుంచి వేతనం రాకపోవడంతో కుటుంబం గడవటం ఇబ్బందిగా ఉంది. కలెక్టర్ చొరవ తీసుకొని జిల్లాలోని 16 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనం ఇప్పించి ఆదుకోవాలి.
– జి.నాగరాజు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి
అక్రమంగా పట్టా చేసుకున్నారు..
తన భర్త ఎండీ అబ్బాస్ పేరు మీద సర్వే నంబర్ 448లో 2.28 ఎకరాల భూమి ఉంది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నాం. బతుకుదెరువు కోసం వేరే గ్రామానికి వెళ్తే మా బంధువులు ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా పట్టా చేసుకున్నారు. ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ప్రయోజనం లేదు. విచారణ చేపట్టి న్యాయం చేయాలి. – ఎండీ జెహేరా, తిడుగు

ఆరు నెలల నుంచి వేతనం లేదు..