
ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
జనగామ: అన్ని శాఖల అధికారుల సమన్వయంతో గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టర్ సమావేశం హాలులో అదనపు కలెక్టర్‌లు బెన్షాలోమ్, పింకేష్‌కుమార్, డీసీపీ రాజ మహేంద్రనాయక్‌తో కలిసి సబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 6వ తే దీ వరకు ఉత్సవాలు జరగనున్నాయని, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు సంబంధిత అధికారులతో సమావేశాలు ఏర్పాటు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాలన్నారు. నిమజ్జనం చేసే చెరువుల వద్ద రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షణలో పటిష్టమైన భారీగేడ్లు, క్రేన్లు, నిరంతర విద్యుత్ సరఫరాకు ఎన్‌పీడీసీఎల్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ, నిమజ్జన ప్రాంతంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 20 మంది గజ ఈతగాళ్లతో పాటు పోలీసు భద్రత ఉండాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. మండపాల నిర్వాహకులు ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీఓలు గోపీరామ్, డీఎస్ వెంకన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొమరయ్య, డీపీఓ నాగపురి స్వరూప, ఏసీపీ భీమ్‌శర్మ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు.
మట్టి వినాయకులను పూజిద్దాం
వినాయక చవితి పండుగ రోజు మట్టి ప్రతిమలను పూజించి, పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సునీత ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ మానస, జిల్లా బీసీ సంక్షేమాధికారి రవీందర్, డీపీఓ స్వరూప, ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, ఎస్‌డీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొమురయ్య తదితరులు ఉన్నారు.
మండపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా