
కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు
● సెప్టెంబర్ నుంచి ఆరు స్పెషల్ ట్రైన్ సర్వీస్‌లు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల సౌకరార్థ్యం దీపావళి, ఛాత్, విజయదశమి పండుగల సందర్భంగా కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా సంత్రగచ్చి–చర్లపల్లి మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ ఆదివారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు సంత్రగచ్చి–చర్లపల్లి (08845) ఎక్స్‌ప్రెస్ ప్రతీ శుక్రవారం సంత్రగచ్చిలో బయలుదేరి శనివారం కాజీపేట జంక్షన్‌కు చేరుకుంటుంది. అదేవిధంగా సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు చర్లపల్లి–సంత్రగచ్చి (08846) ఎక్స్‌ప్రెస్ ప్రతీ శనివారం కాజీపేట జంక్షన్‌కు చేరుకుంటుంది. ఈ రైళ్ల సర్వీస్‌లకు అప్‌అండ్‌డౌన్ రూట్‌లో ఖరగ్‌పూర్, బాలాసోర్, బద్రఖ్, కటక్, భువనేశ్వర్, ఖుర్ధ రోడ్, బెరహంపూర్, విజయనగరం, సింహాచలం, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, రాయన్‌పాడ్, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.
రైలు నుంచి జారి పడి యువకుడి దుర్మరణం
ఖిలా వరంగల్: రైలు నుంచి జారి పడి ఓ యు వకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన నె క్కొండ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ జి. సుదర్శన్ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని గోండియా జిల్లా సదక్ అర్జనీ గ్రామానికి చెందిన రామేశ్వర శ్రీరామజీ బోయర్(28) ఆదివారం ఉదయం గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆధార్, ఓటర్ కార్డుల ఆధారంగా మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి భద్ర పర్చినట్లు ఆయన తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన శనివారం రాత్రి వెంగ్లాపూర్ గ్రామంలో జరిగింది. తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి కథనం ప్రకారం... వెంగ్లాపూర్ గ్రామానికి చెందిన ఆలెం సురేశ్ (40) కుమార్తె లాస్య ఆరోగ్యం బాగా లేకపోవడంతో ములుగు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. వెంగ్లాపూర్ దాటిన తర్వాత ఐకేపీ సెంటర్ వద్ద రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈఘటనలో సురేశ్‌కు బలమైన గాయాలు, కుమార్తె లాస్యకు స్వల్ప గాయాలయ్యాయి. 108లో ములుగు ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యాధికారి పరీక్షించి సురేశ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆదివారం మృతుడి తల్లి ఎర్రక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
మహిళను బెదిరించిన వ్యక్తిపై కేసు
గీసుకొండ : గీసుకొండ మండలం కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు(కేఎంటీపీ) వద్ద ఓ మహిళను బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది. పోలీసుల కథనం ప్రకారం.. సంగెం మండలం చింతలపల్లి తండాకు చెందిన ఆంగోత్ కమల కేఎంటీపీలో హోటల్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శనివారం రఫీక్ అనే డ్రైవర్ హోటల్‌లో టీ తాగిన అనంతరం చిట్టీపై తన ఫోన్ నంబర్ రాసి అందులో డబ్బులు పెట్టి ఆమెకు ఇచ్చాడు. ఇలా ఎందుకు ఇచ్చావని కమల ప్రశ్నించగా ఆమెను దుర్బాషలాడుతూ చంపుతానని బెదిరించాడు. దీంతో సదరు మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ సీఐ మహేందర్ ఆదివారం తెలిపారు.

కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు