
ఎస్జీటీలకు ఎస్‌ఏలుగా పదోన్నతి
జనగామ: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ)కు పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుంది. స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పదోన్నతుల కోసం జిల్లా విద్యాశాఖ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి, నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నారు. సీనియార్టీ ప్రకారం జిల్లాలో 172 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండగా, 88 మందికి పదోన్నతి లభించనుంది. ఇందుకు సంబంధించి నేడు వెబ్‌ఆప్షన్లు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయగా, 26న ప్రమోషన్ ఆర్డర్లు విడుదల చేయనున్నారు. గతంలోనే సీనియార్టీ కలిగిన 20 మంది స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్ మాస్టర్లుగా పదోన్నతి పొందిన నేపథ్యంలో, మిగిలిన ఖాళీలను ఎస్జీటీలతో భర్తీ చేస్తున్నారు. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. డీఈఓజనగామ. కామ్‌లో పదోన్నతుల జాబితాను అప్‌లోడ్ చేశారు. ఈ జాబితాలో ఉన్న మొబైల్ నంబర్‌ను పదోన్నతి పొందనున్న టీచర్లు ధ్రువీకరించడంతో పాటు రిజిస్టర్ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో వెబ్ ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. మొబైల్ నంబర్‌తో తప్పుగా ఉంటే వెంటనే సరి చేసుకోవాలని డీఈఓ ఆదేశించారు. పదోన్నతుల తర్వాత విద్యాశాఖలో ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది.
సబ్జెక్టుల వారీగా పదోన్నతి
పొందుతున్న ఎస్టీటీలు
పీఎస్ హెచ్‌ఎం 22, బయాలజీ 15, సోషల్ 24, గణితం 6, ఫిజిక్స్ 5, ఇంగ్లిష్ 9, తెలుగు 1, హిందీ 2, ఫిజికల్ డైరెక్టర్ 1, స్పెషల్ ఎడ్యుకేషన్ 3 ఎస్జీటీలు పదోన్నతి పొందనున్నారు.
172 ఖాళీలు.. 88 మందికి పదోన్నతులు
నేడు వెబ్ ఆప్షన్లు.. రేపు ఆర్డర్ కాపీలు