
ఘనంగా స్తంభం పాకుడు
స్టేషన్‌ఘన్‌పూర్ : మండలంలోని ఇప్పగూడెంలో కృష్ణాష్టమి తొమ్మిదో రోజున ప్రతీ ఏటా నిర్వహించే స్తంభం పాకుడు వేడుకలను ఆదివారం వేణుగోపాలస్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ కచేరి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇనుప పైప్ స్తంభం పాకే కార్యక్రమాన్ని నిర్వహించగా యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. వెంకటేష్ అనే యువకుడు స్తంభంపై వరకు పాకి విజేతగా నిలువగా అందరూ అభినందించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు దామెర వేణు, జూలుకుంట్ల ప్రకాశ్‌రెడ్డి, దార్న శ్రీధర్, పోకల చందర్, రామజ్యోతి, శ్రీను, నరేష్, రాజు, శ్రీను, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.