
మట్టి గణపతులకే జై
సహజసిద్ధమైన ప్రకృతి ఒడిలో రసాయనాల కాలుష్యం రోజురోజుకు ఎక్కువ అవుతుంది. ప్లాస్టిక్ వ్యర్ధాలు, ప్రమాదకర వాయువులతో పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. వినాయక చవితి అంటే ప్రతీ ఇంటా బొజ్జ గణపయ్య ప్రతిమలు ప్రతిష్ఠించడం ఆనవాయితీ. పూర్వకాలంలో మట్టి విగ్రహాలనే ఎక్కువగా పూజించేవారు. ఆధునిక పోకడలు పెరిగిపోవడం, రంగులను చూసి ఆకర్షణకు గురవుతూ, ఆర్భాటాలకు వెళ్తూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. భవిష్యత్ తరాలను ఆలోచిస్తున్న పర్యావరణ వేత్తలు మట్టి విగ్రహాల ఆవశ్యకతను తెలియజేస్తూ, అటు తయారీదారులు, మరోవైపు ప్రజలను చై తన్య పరిచేవిధంగా ప్రయత్నిస్తున్నారు. మరో రెండురోజుల్లో వినాయక చవితి పండుగ నేపధ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
– జనగామ
మట్టి ముద్దలకు మనోహర రూపాలు
● ఏటా పెరుగుతున్న మట్టి వినాయక విగ్రహాలు
● పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, వాసవీ కన్యకాపరమేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ
● ఐదు వేలకుపైగా విగ్రహాల తయారీ
ఎస్‌పీఆర్ స్కూల్‌లో మట్టి విగ్రహాలను తయారు చేస్తున్న విద్యార్థులు
చెరువు మట్టితో మనోహర రూపాన్ని..

మట్టి గణపతులకే జై

మట్టి గణపతులకే జై