
జోరుగా విగ్రహాల విక్రయాలు
● రూ.2 వేల నుంచి రూ.20వేల వరకు..
జనగామ: జిల్లాలో వినాయక విగ్రహాల విక్రయాలు ఊపందుకుంది. ఈ నెల 27 నుంచి వినాయక చవితి పండగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంతో పాటు స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో విగ్రహాల అమ్మకాలు జోరందుకున్నాయి. రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన కుటుంబాలు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని 2వేల వినాయక ప్రతిమలను తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారు. ఇక్కడ తయారైన విగ్రహాలు సూర్యాపేట, సిద్దిపేట, నల్లగొండ, చేర్యాలతో పాటు జిల్లాలోని ఆయా మండలాలకు సప్లయ్ చేస్తున్నారు. పలువురు వ్యాపారులు హైదరాబాద్ నుంచి హాల్‌సేల్‌గా మరో 2వేల విగ్రహాలు కొనుగోలు చేసి, ఇక్కడ రిటేయిల్‌గా అమ్మకాలు చేస్తున్నారు. అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విగ్రహాల అమ్మకాల నిర్వాహకులు కొంత ఆందోళనలో ఉన్నారు.
భక్తిని పెంపొందించే
డిజైన్లలో..
వినాయక ప్రతిమలను చూడగానే భక్తిని పెంపొందించే విధంగా వివిధ దేవతామూర్తులతో కలిసి ఉండి ఆకట్టుకునే గణపతులను తయారు చేశారు. సుమారు 10 ఫీట్ల ఎత్తులో విభిన్న రూ పాల్లో ఉన్న విగ్రహాలు రూ.2వేల నుంచి రూ.20 వేల వరకు ధర పలుకుతున్నాయి.

జోరుగా విగ్రహాల విక్రయాలు

జోరుగా విగ్రహాల విక్రయాలు