
సొసైటీ భూములపై సీఎం చొరవ చూపాలి
● టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్
జనగామ: భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ భూములకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి చొరవ చూపించాలని జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు ఖాజా షరీఫ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన దీక్షకు జిల్లా ఉంచి టీఎన్జీఓ నాయకులు తరలి వెళ్లారు. జూబ్లీహిల్స్ గోపాల్‌పూర్‌లోని సర్వే 142 ఎకరాల భూమిని భాగ్యనగర్ హౌసింగ్ సోసైటీ ఉద్యోగులకు గత ప్రభుత్వం కేటాయించిందని, సీఎం ప్రత్యేక దృష్టి సారించి సొసైటీ సభ్యులకు స్థలాలను ఇప్పించాలన్నారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి పెండెల శ్రీనివాస్, పేర్వారం ప్రభాకర్, ఎండీ హఫీజ్, నాగార్జున తదితరులు ఉన్నారు.