
అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బెన్షాలోమ్
జనగామ: జనగామ రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్‌గా పి.బెన్షాలోమ్‌ను నియమిస్తూ రెవెన్యూ విభాగం ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జనగామలో పని చేస్తున్న రోహిత్‌సింగ్‌కు పౌరసరఫరాల శాఖ అదనపు డైరెక్టర్‌గా నియమించారు. 2017 (ఐఏఎస్) బ్యాచ్‌కు చెందిన బెన్షాలోమ్.. యాదాద్రి భువనగిరి, నారాయణపేట రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా పని చేశారు. నారాయణపేట జిల్లా నుంచి ఇటీవల బదిలీ కాగా, వెయిటింగ్‌లో ఉన్న ఆయనకు జనగామ ఏసీగా నియమించారు. ఈ మేరకు రేపు (సోమవారం) అదనపు కలెక్టర్‌గా బాధ్యతలను తీసుకోనున్నారు. అదేరోజు రోహిత్‌సింగ్ రిలీవ్ కానున్నారు. కాగా 2023 జూన్ 3వ తేదీన జనగామ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రోహిత్‌సింగ్ విధి నిర్వహణలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. రాష్ట్ర స్థాయిలో సేవలందించేందుకు పదోన్నతిపై వెళ్లడంతో అన్ని వర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.