
నవరాత్రులు శాంతియుతంగా నిర్వహించుకోవాలి
జనగామ రూరల్: గణపతి నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. శుక్రవారం ఏసీపీ కార్యాలయంలో పోలీసులు, యువత, వివిధ మతస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ మండపాల వద్ద నిబంధనల మేరకు వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు దామోదర్‌రెడ్డి, శ్రీనివాస్, అబ్బయ్య, భరత్, చెన్నకేశవులు, శ్రీదేవి, వేణు, నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలి
పాలకుర్తి టౌన్: పోలీస్‌స్టేషస్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. శుక్రవారం పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ జనకిరామ్‌రెడ్డి, ఎస్సైలు దూలం పవన్‌కుమార్, లింగారెడ్డి, యాకుబ్ హుస్సేన్, సిబ్బంది పాల్గొన్నారు.
డీసీపీ రాజమహేంద్రనాయక్