
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేస్తాం
● ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తి: నియోజకవర్గంలో శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయిస్తామని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గంలోని మైలారం, విస్నూరు, పాలకుర్తి, వల్మిడి, ముత్తారం తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించగా పలు పనులకు శంకుస్థాపన చేశారు. మైలారంలో రూ. 1 కోటి, ముత్తారంలో రూ.2.80 కోట్లతో నిర్మించిన బ్రిడ్జితో పాటు మరికొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యశాలల పనితీరు మెరుగుపడినప్పుడే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఎన్. వసంత, పీఆర్ డీఈ రామలింగయ్య, చిట్యాల ఐలమ్మ, వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ మంజుల భాస్కర్, అడ్డూరి రవీందర్‌రావు, రాపాక సత్యనారాయణ, గిరగాని కుమార్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.