
తడిసిముద్దయిన పెసర
● వరుస వర్షాలతో పంటకు తీవ్ర నష్టం
● పరిహారం అందించాలని
రైతుల వినతి
పాలకుర్తి: మండలంలో వేసిన 250 ఎకరాల పెసర పంటకు వరుస వర్షాలతో తీవ్ర నష్టం జరిగింది. తమ పంటకు పూర్తిగా నష్టం జరిగిందని, న్యాయం చేయాలని రైతులు మండల వ్యవసాయాధికారులకు బుధవారం విన్నవించారు. అన్ని గ్రామాల్లో పెసర పంటకు నష్టం జరిగిందని, విస్నూరు గ్రామంలో ఏనుగ అశోక్ తాను మూడు ఎకరాల్లో వేసిన పెసర పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మండలంలో పెసర పంటకు తీవ్ర నష్టం జరిగిన విషయం వాస్తవమేనని మండల వ్యవసాధికారి శరత్ చంద్ర తెలిపారు. నష్టంపై నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు.