
వాతావరణ మార్పులపై అవగాహన
జనగామ: మానసిక ఆరోగ్యంపై వాతావరణ మార్పు హానికరమైన ప్రభావాలను తెలుసుకునేందుకు అనేక దేశాల్లో నిర్వహించిన 19 అధ్యయనాల సారాంశంపై ‘సాక్షి’ మెయిన్ పేజీలో ‘సోలాస్టాల్జియా’ కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనం జనగామ పట్టణం నెహ్రూపార్కు రోడ్డులోని సెయింట్ పాల్స్ ప్రధానోపాధ్యాయురాలు మరియాజోసెఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో ప్రేరణ కలిగించింది. సేవ్‌ఎర్త్, వాటర్, పొల్యూషన్, జంతువుల రక్షణ, వనసంపదను రక్షించుకుందాం..అనే నినాదంతో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ, సాక్షి దినపత్రికను చదువుతూ ప్రార్ధన సమయంలో విద్యార్థులు సహచర పిల్లలకు అవగాహన కలిగించారు.
‘సాక్షి’ కథనం ప్రేరణగా సెయింట్ మెరీస్ విద్యార్థుల ప్రదర్శన