
యూరియా కొరత సృష్టించొద్దు
లింగాలఘణపురం: జిల్లాలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని, దుకాణాదారులు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ షేక్ రిజ్వా న్ బాషా హెచ్చరించారు. బుధవారం మండలంలో ని నెల్లుట్ల, లింగాలఘణపురం గ్రామాల్లోని ఆగ్రోస్ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్టాక్ నిల్వలు, కొనుగోలు చేసిన రైతుల వివరాలను పరిశీలించారు. కలెక్టర్‌తో పాటు డీఏఓ అంబికాసోనీ, తహసీల్దార్ రవీందర్, ఏఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏఈఓ స్పందన ఉన్నారు.
కురుమ సంఘం భవనం నిర్మించండి..
జనగామ: జిల్లా కేంద్రంలో దొడ్డి కొమురయ్య కురు మ భవనంతో పాటు ఒగ్గు కళాక్షేత్రం, డాక్టర్ చుక్క సత్తయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు కంచె రాములు ఆధ్వ ర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి జాయ మల్లేష్, ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండి వీరస్వామి, ప్రచార కార్యదర్శి అనిల్‌కుమార్, లింగాలగణపురం మండల కురుమ సంఘం అధ్యక్షుడు బండ చంద్రమౌళి, చౌదరపల్లి విజయభాస్కర్, జనగామ మండల అధ్యక్షుడు బండ రవి, పట్టణ అధ్యక్షుడు గడ్డం మల్లేశం, నకిర్త వీరస్వామి, పూర్ణచంద్ర, వినయ్, హరీశ్ పాల్గొన్నారు.
నానో యూరియాతో ప్రయోజనాలు..
జనగామ రూరల్: నానో యూరియాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ అధికారులకు నానో యూరియాపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికాసోని, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్, ఏడీఏలు, అధికారులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
‘ఉపాధి’ పనులు ముమ్మరం చేయాలి..
ఉపాధి హామీ పనులు ముమ్మరం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో డీఆర్‌డీఓ వసంత ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచా యతీ సెక్రటరీలతో వీసీ ద్వారా సమీక్షించారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఉపాధి హామీ పనులు చేపట్టాలని, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. వీసీలో ఈజీఎస్ అదనపు పీడీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా ‘పనుల జాతర’..
పనుల జాతర– 2025 కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. పనుల జాతరలో భాగంగా 22 తేదీన కొత్త పనులను ప్రారంభించడానికి ముఖ్యంగా పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, కోళ్ల ఫామ్ షెడ్లు, పొలం బాటలు, గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలు, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు, సెగ్రిగేషన్ షెడ్లు, గ్రామీణ రహదారులు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల ద్వారా చేస్తున్నామన్నారు.
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా