
సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థికి డెంగీ
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ శివారు పల్లగుట్ట క్రాస్‌రోడ్డు సమీపంలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థికి డెంగీ జ్వరం రావడంతో ఘన్‌పూర్ ప్ర భుత్వ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. చిల్పూరు మండలం మల్కాపూర్‌కు చెందిన ఏడో తరగతి విద్యార్థి అజయ్‌కుమార్ మూడురోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో పాఠశాలకు చెందిన డాక్టర్ పవన్‌కుమార్ ఘన్‌పూర్ సీహెచ్‌సీలో బుధవారం చూపించగా డెంగీ ఫీవర్‌గా గుర్తించారు. అప్రమత్తమైన ఘన్‌పూర్ సీహెచ్‌సీ వైద్యుల ఆధ్వర్యంలో పాఠశాలలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. జ్వర లక్షణాలు కలిగిన 44 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. పాఠశాల పరిసరాల్లో, విద్యార్థుల గదుల్లో దోమల నివారణ మందు స్ప్రే చేశారు. కార్యక్రమంలో ఘన్‌పూర్ సీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ రుబీనా, ఆర్‌బీఎస్‌కే ఎంఓ డాక్టర్ అజయ్‌కుమార్, సీహెచ్‌ఓ వెంకటస్వామి, ఎస్‌యూఓ శేషయ్య, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రఘుపతి, పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హెల్త్‌క్యాంపు నిర్వహించిన వైద్యసిబ్బంది