
బ్రిడ్జిపై లైట్లు ఏర్పాటు చేయాలి
జనగామ రూరల్: పట్టణంలోని నెహ్రూ పార్క్ నుంచి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వరకు రైల్వే క్రాసింగ్ కోసం ఏర్పాటుచేసిన బ్రిడ్జిపై లైట్లు ఏర్పాటు చేసి రాత్రిపూట ప్రమాదాలు జరగకుండా ప్రజల ప్రాణా లకు రక్షణ కల్పించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బూడిది గోపి డిమాండ్ చేశారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశా రు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలో హైదరాబాద్–కాజీపేట రైల్వేలైన్ క్రాసింగ్ చేయడం కోసం బ్రిడ్జి నిర్మించారు. సరైన నిర్వహణ లేకపోవడంతో బ్రిడ్జి పాడుకావడంతో పాటు పెచ్చులూడిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సి పాలిటీ అధికారులు బ్రిడ్జిపై లైటింగ్ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. బొట్ల శేఖర్, బీరయ్య, ఎండీ అజారుద్దీన్, బూడిది ప్రశాంత్, ఉపేందర్, సుధాకర్, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయం ఎదుట
సీపీఎం ధర్నా