
కాల్వ మరమ్మతు పనుల పరిశీలన
బచ్చన్నపేట: మండలంలోని లక్ష్మాపూర్ శివారులో గల గోదావరి పైపులైన్ డెలివరీ పాయింట్ నుంచి కొడవటూర్ గ్రామచెరువులోకి వెళ్లే కాల్వ మరమ్మతు పనులు చేయిస్తామని ఇరిగేషన్ డీఈ మంగీలాల్ అన్నారు. బుధవారం కాల్వ మరమ్మతు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ కాల్వ పనులకు గానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.10.35లక్షలు మంజూరు చేసిందన్నారు. కాలువ పనులు పూర్తయితే గోదావరి జలాలు సులువుగా చెరువులోకి వెళ్తాయని తెలిపారు. కొడవటూర్ చెరువు నుంచి తాళ్ల చెరువు, చింతలకుంట, గుడి చెరువు నిండే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీఈ శ్రావణ్, ఏఈ వెంకన్న, సర్పంచ్‌ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీశ్‌రెడ్డి, నాయకులు కొల్ల నర్సిరెడ్డి, నీల శ్రీనివాస్, మిన్నాలపురం కనుకయ్య, వంగపల్లి శేఖర్‌రెడ్డి, కరికె కర్ణాకర్ పాల్గొన్నారు.