
సీఎంఆర్ లక్ష్యం చేరుకోవాలి
జనగామ: జిల్లాలో ఖరీఫ్, రబీ (2024–25) సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ డెలివరీ నిర్ణీత గడువులోగా లక్ష్యం చేరుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం హాలులో ఖరీఫ్, రబీ 2024–25 సీఎంఆర్ డెలివరీ, రాబోవు ఖరీఫ్ 2025–26 సంసిద్ధత అంశాలపై రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి కలెక్టర్ ఉన్నతాధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను అనుసరించి రైస్ మిల్లర్లు సీఎంఆర్‌ను నిర్ణీత సమయంలో డెలివరీ చేయాలన్నారు. 2024–25 వానాకాలం(ఖరీఫ్) సీజన్‌లో 18,055 మెట్రిక్ టన్నులు, యాసంగి (రబీ) 2024–25లో 80,095 మెట్రిక్ టన్నులు బియ్యాన్ని రైస్ మిల్లర్లు డెలివరీ చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుత సీజన్ వానాకాలం సీజన్‌లో(2025–26) వచ్చే వరి ధాన్యం కొనుగోళ్ల అంచనా లకు తగ్గట్టుగా ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకో వాలన్నారు. ఈ సమీక్షలో సివిల్ సప్లయీస్ డీఎం హథిరామ్, పౌర సరఫరాల శాఖ అధికారి సరస్వతి, డీఆర్డీఓ పీడీ వసంత, డీఏఓ అంబికాసోని, మార్కెటింగ్ డీఎం నరేంద్ర, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్, వెలిదె వెంకన్న, అశోక్, గాదె శ్రీనివాస్, దాస నర్సయ్య, జిల్లా హరికిషన్, లక్ష్మణ్, రమేశ్, సంతో ష్, దొంతుల రాజు తదితరులు ఉన్నారు.
అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
రైస్ మిల్లర్ల సమీక్షలో
కలెక్టర్ రిజ్వాన్ బాషా