
సోమేశ్వరాలయంలో లక్ష బిల్వార్చన
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మినర్సింహస్వామి దేవాలయంలో శ్రావణమాసం ఉత్సవాల్లో భాగంగా మంగళవారం లక్ష బిల్వా ర్చన, కుంకుమార్చన, చండీయాగం నిర్వహించారు. అలాగే అర్చకుల వేద మంత్రోచ్చరణ మధ్య వైభవంగా ఆరుద్రోత్సవం జరిగింది. 108 లీటర్ల ఆవుపాలతో ఆభిషేకం, గర్భాలయ దీపోత్సవం, పుష్పాలంకరణ, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్‌శర్మ, దేవగిరి అనిల్‌కుమార్, మత్తగజం నాగరాజు, ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.