
ఓపీఎస్ అమలు చేయాలి
జనగామ: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వెంటనే అమలు చేయాలని కోరుతూ వచ్చే నెల 1న మహాధర్నా తలపెట్టినట్లు పీఆర్‌టీయూ సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్ల మహిపాల్‌రెడ్డి, టీజీఈ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఖాజీ షరీఫ్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ అసంబద్ధమైన సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందు పరిచిన విధంగా సీపీఎస్‌ను రద్దు చేసి, మాట నిలబెట్టుకోవాలన్నారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం పురస్కరించుకుని చేపట్టే మహాధర్నాలో సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు కొర్నేలియస్, ఆంజనేయులు, బొగ్గారపు శ్రీనివాస్, సీతారామయ్య, మహిపాల్ రెడ్డి, మర్యాల రమేష్, బీకోజపీ, అంబటి నగేష్, నరేందర్, లక్ష్మణ్, బాబు, పుల్లారెడ్డి, మధుసూదన్ తదితరులు ఉన్నారు.